వర్షాన్ని షేర్ చేసుకుంటా : కత్రినా

by  |
వర్షాన్ని షేర్ చేసుకుంటా : కత్రినా
X

మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ కత్రినా కైఫ్. కెరీర్ తొలినాళ్లలో హిందీలో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కాగా ‘మల్లీశ్వరి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్రిటన్ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అయితే ఈ మధ్య కాట్స్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేక పోతున్నాయి. అయినా కూడా అమ్మడి అందానికి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. కాగా, లేటెస్ట్‌గా తన అభిరుచుల గురించి వెల్లడించిన ఈ భామ.. వర్షం పడ్డప్పుడు తానేం చేస్తుందో ఇన్‌స్టా అభిమానులతో పంచుకుంది.

సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా వర్షాన్ని ఆస్వాదించని వారెవరూ ఉండరు కదా! అయితే, వర్షం పడ్డప్పుడు.. కత్రినా ఏం చేస్తుందో తెలుసా? ‘ఎప్పుడైనా వర్షం పడితే.. నా గొడుగును మరొకరితో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఆ సమయంలో నా దగ్గర గొడుగు లేకపోతే వర్షాన్ని పంచుతాను’ అని చెబుతోంది. ఈ మాటలతో పాటు చిరునవ్వులు చిందిస్తూ.. గొడుగుతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంంది.

https://www.instagram.com/p/CEOKlBmhn_2/

Next Story

Most Viewed