గంట ముందే మేల్కొంటే.. డిప్రెషన్ తగ్గే అవకాశం

by  |
గంట ముందే మేల్కొంటే.. డిప్రెషన్ తగ్గే అవకాశం
X

దిశ, ఫీచర్స్: ‘ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్’ అనే వ్యాక్యాన్ని చిన్ననాటి నుంచి వింటున్నారు. కానీ మారుతున్న పరిస్థితుల వల్ల నేటితరం, ఆ ముందు తరాలు కూడా తమ స్లీప్ సైకిల్‌ను మార్చేసుకుంటున్నారు. అంతేకాకుండా పెరిగిన డిజిటిల్ వాడకం కూడా నిద్రను దూరం చేస్తుంది. ఒకప్పుడు ఏడింటికే పడుకునే పల్లె జనాలు కూడా ప్రస్తుతం పదకొండు దాటిని కూడా మేల్కొనే ఉంటున్నారు. వీటికితోడు సిటీ కల్చర్, నైట్ షిప్ట్ ఉద్యోగాలు, టీవీ కార్యక్రమాలు కూడా రాత్రి నిద్రకు భంగం కలిగిస్తున్నాయి. అయితే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కావడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనా సాధారణ షెడ్యూల్‌కు ఒక గంట ముందు మేల్కొనడం వలన డిప్రెషన్ నుంచి బయటపడొచ్చని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

కేవలం ఒక గంట ముందు మేల్కొనడం వల్ల ‘డిప్రెషన్’ (Depression) వచ్చే ప్రమాదం 23% తగ్గుతుందని మే 26న జామా సైకియాట్రీ పత్రికలో ప్రచురించిన కొత్త జన్యు అధ్యయనం సూచిస్తుంది. కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం, బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంఐటీ, హార్వర్డ్ పరిశోధకులు 840,000 మంది వ్యక్తులపై జరిపిన క్రోనోటైప్(వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఒక నిర్దిష్ట సమయంలో నిద్రపోయే ప్రవృత్తి) అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ నిద్రించే సమయం డిప్రెషన్ ప్రమాదాన్ని భారీగా ప్రభావితం చేస్తుందనే బలమైన ఆధారాన్ని ఈ అధ్యయనం ముందుకు తీసుకొచ్చింది. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి ఎంత మార్పు అవసరమో లెక్కించేందుకు జరిగిన తొలి అధ్యయనంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పోస్ట్-పాండమిక్, రిమోట్‌గా పని చేయడం, ఆన్‌లైన్ పాఠాలు కూడా చాలా మంది తమ నిద్ర షెడ్యూల్‌ మారడానికి కారణమయ్యాయి.

‘నిద్ర సమయం, మానసిక స్థితి మధ్య సంబంధం ఉందని మాకు కొంతకాలంగా తెలుసు, కాని వైద్యుల నుంచి మనం తరచుగా వినే ప్రశ్న ఏంటంటే.. ఎంత ముందు పడుకుంటే లేదా ఎర్లీగా లేస్తే ప్రయోజనం ఉంటుందో తేలాలని వారంటారు. ఈ క్రమంలోనే ఒక గంట ముందు నిద్ర లేవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మేం గుర్తించాం. PER2‌గా పిలిచే క్లా్క్ జీన్ సహా 340 కి పైగా సాధారణ జన్యు వైవిధ్యాలు ఒక వ్యక్తి క్రోనోటైప్‌ను ప్రభావితం చేస్తాయి. స్లీప్ ట్రాకర్లు, వారి నిద్రా ప్రాధాన్యత ఆధారంగా విశ్లేషించాం. ఓ వ్యక్తి ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు నిద్ర పోయి, 8 గంటలకు నిద్ర లేస్తుంటే.. ఆ వ్యక్తి ఉదయం ఓ గంట ముందు లేవడం లేదా రాత్రి ఓ గంట ముందు పడుకోవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం 30-40% తగ్గుతుంది.
– సెలిన్ వెటర్, సీనియర్ రచయిత, ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్

Disclaimer : వివిధ మాధ్యమాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రాయడం జరిగినది


Next Story