కిడ్నీలో రాళ్ల సమస్యతో సునిల్ నరైన్

36

దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తున్నది. నరైన్‌కు ఈ సమస్య ఏర్పడటంతోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు తరపున మూడు మ్యాచ్‌లు ఆడలేదని ఆ జట్టు కోచ్ మెక్‌కల్లమ్ తెలిపారు.

ప్రస్తుతం మూత్రపిండాల సమస్య నుంచి కోలుకున్న నరైన్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. సీపీఎల్ ప్రారంభంలో వరుసగా రెండు అర్థసెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న నరైన్‌ను జట్టు దూరం పెట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, అసలు కారణం కిడ్నీ సమస్యేనని యాజమాన్యం తెలియజేసింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగుందని, తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతున్నట్టు మెక్‌కల్లమ్ తెలిపాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..