ఆ ముఖ్యమంత్రిపై షారుఖ్ ఫ్యాన్స్ ఫైర్.. పొలిటికల్‌ డ్రామా అంటూ..

by  |
sharuk, aryan
X

దిశ, సినిమా: డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి ఇంతకుముందు పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై స్పందించారు. తాజాగా ముంబై‌లోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకున్న ఆమె.. అనంతరం శివసేన, ఎన్సీపీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును ప్రస్తావించారు. ‘మహేష్ జీ (సినిమా దర్శకుడు మహేశ్ భట్).. మీరు, షారుఖ్ ఖాన్ అన్యాయంగా చట్టవిరుద్ధ చర్యలకు బలయ్యారు. ఇలాంటి కుట్రలను ఓడించాలంటే మనం పోరాడాలి. అవకాశం ఉన్న చోట వారి విధానాలను ఎండగట్టాలి. రాజకీయ పార్టీగా మేము కూడా సహకరిస్తాం. ఈ దిశగా మాకు మార్గదర్శకం చేయడంతో పాటు తగిన సలహాలు ఇవ్వండి’ అని సూచించింది.

అయితే ఆర్యన్ డ్రగ్స్ కేసుపై ఆలస్యంగా స్పందించిన మమతపై షారుఖ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ విషయం మేడం గారికి ఇప్పుడు గుర్తొంచ్చిందా? దీదీ షారుఖ్‌ను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేస్తోంది’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed