సూర్యాపేటలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం..

by  |
సూర్యాపేటలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం..
X

దిశ, సూర్యాపేట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు నల్గొండ జిల్లా జడ్జి బీఎస్ జగ్జివన్ కుమార్, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పలువురు ఘన స్వాగతo పలికారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో సూర్యాపేటలోని సెవెన్ స్టార్ హోటల్ లో అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మోహన్ కుమార్, న్యాయవాదులు వసంత్ కుమార్, సురేష్, ప్రశాంతి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎమ్మార్వో వెంకన్న, బార్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed