చిత్రమైన చట్టాలు.. విచిత్రమైన శిక్షలు

by  |
చిత్రమైన చట్టాలు.. విచిత్రమైన శిక్షలు
X

దిశ, ఫీచర్స్: పూర్వం బ్రిటీషర్ల కాలంలో ఉప్పుపై, గడ్డంపై కూడా పన్ను వసూలు చేసేవారు. అంతేకాదు ఇంటి కిటికీల సంఖ్య పెరిగినా శిస్తు కట్టాల్సిందే. బ్యాచిలర్, టాటూ, పంప్కిన్ ట్యాక్స్‌లు కూడా అమల్లో ఉండేవి. ఒకప్పుడు ఇలాంటి విచిత్రమైన ట్యాక్స్‌లు ఉండగా.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మరింత చిత్రమైన చట్టాలు అమలవుతున్నాయి. ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారమే ఈ నిబంధనలు తీసుకురాగా.. ఆ రూల్స్ ఏంటో? ఎలాంటి జరిమానాలు విధిస్తారో తెలుసుకుందాం.

ఇన్‌హేలర్స్ నిషిద్ధమక్కడ..

జపాన్‌లో ఇన్‌హేలర్స్, అలర్జీ, సైనస్ ఔషధాలు ఉపయోగించడం చట్టవిరుద్ధం. ప్రత్యేకంగా ఉత్ప్రేరకాలు లేదా కోడిన్ కలిగి ఉన్న ఉత్పత్తులు నిషిద్ధం. ఇతర దేశీయులు కూడా వీటిని తీసుకెళ్లరాదు.

కాన్‌ఫెక్షనరీ ప్లాస్టిక్ వద్దు..

పెళ్లి, పుట్టినరోజు ఏ వేడుకైనా వేదికలపై పాప్ అప్స్ పేల్చి సందడి చేస్తుంటాం. అయితే అలబామాలో ఇలాంటి నాన్-బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కాన్‌ఫెట్టిని నిషేధించారు. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నగర చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ ఆధారిత కాన్‌ఫెట్టిని తయారు చేయడం, ఉపయోగించడం చట్టవిరుద్ధం. కానీ పేపర్ కాన్‌ఫెట్టి మాత్రం వినియోగించుకోవచ్చు.

పావురాలకు తినిపించారో..

సాధారణంగా పావురాలకు జొన్నలు వేయడం చాలా ప్రాంతాల్లో చూసే ఉంటారు. కానీ శాన్‌ఫ్రాన్సిస్కోలో మాత్రం అలా చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. నగరంలో పలు వ్యాధులు వ్యాప్తి చెందడం, ప్రాపర్టీ డ్యామేజ్‌కు ఆ పక్షులే కారణమవుతున్నాయట. అందువల్లే ఈ నగరంలో పావురాలకు ఆహారం అందిస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు.

బిల్‌బోర్డ్స్ కనిపించవు..

పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బిల్‌బోర్డ్స్ దర్శనమిస్తుంటాయి. కానీ అగ్రరాజ్యంలోని అలస్కా, హవాయి, మైనే, వెర్మోంట్‌లో మాత్రం వీటిని బ్యాన్ చేశారు. ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

నో హైహీల్స్..

అత్యంత పురాతన స్మారక కట్టడాలకు గ్రీస్ ప్రసిద్ధి. దేశ విదేశీ సందర్శకులు నిత్యం వీటిని దర్శిస్తుంటారు. అయితే వాటిని కాపాడుకునేందుకు గ్రీస్ ప్రభుత్వం సందర్శకులు హైహీల్స్ వేసుకు రావద్దంటూ 2009లో నిషేధం విధించింది. హై హీల్స్ వల్ల అక్కడి ఉపరితలం పాడవుతుందని, స్మారక చిహ్నాలను హని చేయని స్మూత్ బూట్లు, చెప్పులు ధరించాలని అధికారులు వెల్లడించారు.

పెళ్లి డిస్టర్బ్ చేస్తే ఇక అంతే..

ఆస్ట్రేలియాలో ఉద్దేశపూర్వకంగా వివాహానికి, అంత్యక్రియలకు లేదా ఏదైనా మతపరమైన సేవకు ఆటంకం కలిగిస్తే 10వేల జరిమానా లేదా 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.

పెళ్లయిన మహిళకు ఒక్క పెగ్గే..

బొలీవియా, లా పాజ్ నగరంలో వివాహిత మహిళలు అజ్ఞాత పురుషులతో బహిరంగంగా ఒక గ్లాసు వైన్ మాత్రమే తాగడానికి అనుమతి ఉంది. అలాగే ఇతర పురుషులతో తమ భార్యలు పబ్లిక్ ప్లేస్‌లో రోమాన్స్ చేసినట్లు రుజువైతే భర్తలు విడాకులు తీసుకోవచ్చు.

ఆ కరెన్సీ దేశం దాటొద్దు..

థాయ్ కరెన్సీని దేశం దాటవేయడం చట్టవిరుద్ధం. ఎందుకంటే దానిపై దేశ రాజకుటుంబ చిత్రాలు ఉన్నాయి. 1908 నుంచి ఆ ఫ్యామిలీ ఇమేజ్‌‌ కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుటోంది. ఒకవేళ ఎవరైనా చట్ట విరుద్ధమైన పనిచేస్తే జైలులో పెడతారు.

ఎగ్జామ్స్‌లో చీట్ చేస్తే..

పరీక్షల్లో చీటి కొట్టడం ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీనే. అయితే మనదగ్గర డిబార్ లేదా సస్పెండ్ చేస్తుంటారు. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం 15 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్‌లో కాపీ చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.

జాతకాలు చెప్పారో జైలుకే..

మనదేశంలో రేఖలు చూసి, పాచికలు వేసి, తిథులు నక్షత్రాల ఆధారంగా జాతకాలంటూ మన భవిష్యత్ చెబుతుంటారు. కానీ మేరిల్యాండ్, బాల్టిమోర్ నగరంలో రేఖలు చదవడం లేదా రెమ్యూనరేషన్ కోసం జాతకం చెప్పడం నిషేధం. ఒకవేళ ఎవరైనా అలా చెబుతూ పట్టుబడితే 500 జరిమానా లేదా 1 సంవత్సరం జైలు శిక్ష.

బూతుపదానికి నో ఛాన్స్..

బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించకుండా కరేబియన్ ప్రాంతంలో కఠినమైన చట్టం ఉంది. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే, జైలుకు వెళ్లాల్సిందే. 2016 లో ఓ సంగీత కచేరీలో ఒకరిని తిట్టినందుకు ర్యాపర్‌కు 50 సెంట్ల జరిమానాతో పాటు ఖైదుకు కూడా వెళ్లాడు.

చూయింగ్‌గమ్‌కు చోటు లేదు..

రైళ్ల డోర్ సెన్సార్‌లు, మెయిల్‌ బాక్స్‌లు, కీహోల్స్ లోపల, లిఫ్ట్ బటన్‌లు, మెట్ల మార్గాలతో పాటు శుభ్రం చేయడానికి కష్టంగా ఉన్న చోట చూయింగ్‌ గమ్‌ను అతికించడంతో విసుగెత్తిన సింగపూర్ ప్రభుత్వం 1992లో వీటిని నిషేధించింది. అయితే 2004లో దీన్ని సవరించగా, ఆ ఏడాది నుంచి వైద్యుడు లేదా ఫార్మాసిస్ట్ నుంచి మాత్రమే థెరపెటిక్, డెంటల్, నికోటిన్ చూయింగ్ గమ్ కొనుగోలు చేసే నిబంధన అమల్లోకి తెచ్చింది.

ఫేస్ కవర్ చేస్తే.. ఫైన్..

2018నుంచి డెన్మార్క్ పార్లమెంట్ రూల్స్ ప్రకారం పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ కవర్ చేసుకునే దుస్తులు ధరించడం చట్టవిరుద్ధం. ఈ నిషేధం ఇంటిగ్రేషన్, ప్రజా భద్రతను ప్రోత్సహిస్తుందని వారు వాదించారు. అయితే ఇది ముస్లిం సంప్రదాయానికి విరుద్ధమని కొందరు వారించారు. కానీ లాభం లేకపోయింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించితే డానిష్ శిక్షాస్మృతి ప్రకారం 134 b జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది.

బుద్ధుడితో సెల్ఫీ వద్దు..

బౌద్ధ చిత్రాలు, కళాఖండాలతో సెల్ఫీ తీసుకోవడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. తమ ఇష్టారీతిలో పోజులు పెట్టి సెల్ఫీ తీసుకోవడం బుద్ధుడిని అగౌరవపరిచడమేనని ప్రభుత్వం పేర్కొంది. అనేక మంది ఫ్రెంచ్ పర్యాటకులు బుద్ధుని విగ్రహాన్ని ముద్దాడుతున్నట్లు ఫోటో కోసం పోజులిచ్చినందున చట్టంలోని సెక్షన్ కింద దోషులుగా నిర్ధారించబడ్డారు.


Next Story

Most Viewed