విచిత్రంగా వాట్సాప్ లో బర్రెల వెతుకులాట..!!

by Aamani |   ( Updated:2021-11-26 04:07:19.0  )
విచిత్రంగా వాట్సాప్ లో  బర్రెల వెతుకులాట..!!
X

దిశ కుబీర్ : నిరక్షరాస్యులైన రైతులకు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు కొంత కల్సి వస్తున్నాయి. పోయిన వస్తువుల వివరాలను వాట్సాప్ గ్రూపులో పెట్టి దొరికిన వారు ఈ నెంబర్ కు వివరాలను తెలియజేయాలని చెప్పడం సర్వసాధారణమైంది. కుబీరు మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన ఒక రైతు స్నేహితుడు, రాజన్నకు చెందిన బర్రెలు చేను నుంచి వెళ్ళిపోయి నాలుగు రోజులు అయ్యిందంటూ వివరాలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

పోయిన వాటిలో రెండు పెద్దవి ఒక చిన్న పిల్ల ఉంది. పరిసర గ్రామాల్లోని రైతులకు కనిపిస్తే ఈ నెంబర్ కు తెలియజేయాలని పెట్టాడు. పెట్టిన 8 నిమిషాల్లోనే నిన్న గోడిసేరా గ్రామానికి వచ్చిందని సంబంధించిన నెంబర్ కు కాంటాక్టు కావాలని వాట్సాప్ లో పోస్ట్ అయ్యింది. వచ్చి తీసుకెళ్లండి అని రెండు గంటలకు మరో పోస్టు చేశారు. తప్పిపోయిన పశువుల వివరాలను కూడా గ్రూపుల్లో పెట్టుకోవడం, దానికి స్పందన కనిపించడం గమనార్హం.

Advertisement

Next Story