ఈ రాశి వారికి బిజినెస్‌లో భారీ లాభాలు

by  |
Panchangam
X

తేది : 28, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 32 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 51 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న ఉదయం 10 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 49 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 37 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము

మేష రాశి: పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు అన్ని పనులలో విజయం. ఆఫీసులో పై అధికారులు గమనిస్తున్నారు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయకండి. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారిలో ఒకరికి అనారోగ్యం వలన మానసిక అశాంతి. ఆదాయం పర్వాలేదు అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. ఎవ్వరికి అప్పు ఇవ్వకండి. లేకపోతే ఇబ్బందులు. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృషభ రాశి: ఇతరులను గుడ్డిగా నమ్మకండి. మోసపోతారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆఫీసు పనులను పెండింగ్ పనుల తో సహా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి పై అధికారులు గమనిస్తున్నారు. దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగం తగ్గుతుంది. వ్యాపారులు రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు వాయిదా వేయండి. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి: చిరునవ్వు అన్ని సమస్యలకు సమాధానం. దైవ ప్రార్ధన వలన మానసిక బలం ఆఫీస్ పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టబోతున్న వారికి కావలసిన ధన సహాయం లభిస్తుంది. మోసపూరిత పథకాలలో డబ్బులు పెట్టుబడి పెట్టకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ తోడబుట్టిన వారి నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. హోటల్ బిజినెస్ చేసే వారికి లాభాలు. విద్యార్థులకు టీవీ మొబైల్ మీద ధ్యాస తగ్గించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఆదాయం పర్వాలేదు దుబారా ఖర్చులను తగ్గించండి. బయట తిండి వలన అజీర్తి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు.

కన్యారాశి: ఆత్మవిశ్వాసం ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. వ్యాపారులు తమ టాక్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆఫీసు పనులలో మీ నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి నమ్మకమే మీ మీ వైవాహిక జీవితానికి పునాది.

సింహరాశి: అధిక సామర్థ్యం పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి వారితో వాదోపవాదాలకు దిగకండి. ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం ఎక్కువవుతుంది. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. వ్యాపారం లో నూతన పెట్టుబడులకు మంచి అవకాశం. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. కుటుంబ సమస్యల వలన మానసిక అశాంతి. మైగ్రేన్‌తో బాధపడేవారు తమ భోజనం సకాలంలో పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి: ఆనందంగా గడపడానికి మీరు కొంత సమయం మీ కొరకు కేటాయించుకోండి. ఆత్మవిశ్వాసము ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పై అధికారుల సూచనలను పాటించండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి మంచి రోజులు. మీ తల్లి గారి నుంచి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కుటుంబ వ్యవహారాల గురించి చర్చిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

వృశ్చిక రాశి: సహనంతో, సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. అదనపు బాధ్యతల వలన ఆఫీస్ పనులలో అధిక శ్రమ. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకండి. చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఆదాయం కన్నా ఖర్చులు అధికం దాని వలన మానసిక అశాంతి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజును గడపండి.

తులారాశి: ఆర్థిక సామర్థ్యం ఆశావాద దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్. వ్యాపారులకు లాభాలు. ఆదాయం వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశతో మోసపూరిత పథకాలలో పెట్టుబడులు పెట్టకండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మకర రాశి: ఆశావహ దృక్పథంతో ఈ రోజును ప్రారంభించండి. వ్యాపారులు తమ నూతన పెట్టుబడులపై అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టాలను తెస్తాయి. ఆదరణ బాధ్యతల వలన అధిక శ్రమ దానివలన ఒత్తిడి. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం వలన నీకెంతో ఎనర్జీ. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కుంభరాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే కొన్ని సుఖాలను వదులుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపారులకు లాభాలు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. తొడ పుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మరింత కష్టపడి పనిచేయాలి. మీ తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. ఆదాయం పరవాలేదు. దుబారా ఖర్చులను నివారించండి. లేకుంటే డబ్బుకి ఇబ్బంది. సీజన్ మార్పుల వలన కంటి జబ్బులు. ఈ రాశి స్త్రీల కు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు.

మీన రాశి: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే ఆరోగ్య సమస్యలు. నెగెటివ్ ఆలోచనలను వదిలివేయండి. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నించండి. దాని వలన మానసిక ప్రశాంతత. అనవసరపు దుబారా ఖర్చు ల వలన ఏర్పడే డబ్బు ఇబ్బందులను ఈరోజు గుర్తిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ భార్య భర్తలు కుటుంబ ఆర్థిక సమస్యల గురించి చర్చించుకుంటారు.


Next Story

Most Viewed