బుధవారం పంచాంగం, రాశి ఫలాలు (07-04, 2021)

240
Panchangam

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : ఏకాదశి తె4.28వరకు
(తెల్లవారితే గురువారం)
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : ధనిష్ఠ తె5.29
యోగం : సాధ్యం సా4.49
తదుపరి శుభం
కరణం : బవ సా4.46
తదుపరి బాలువ తె4.28
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం : ఉ9.23 – 10.59
దుర్ముహూర్తం : ఉ11.37 – 12.26
అమృతకాలం: రా7.01 – 8.37
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: మీనం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.54
సూర్యాస్తమయం: 6.10

నేటి రాశి ఫలాలు

మేషం

వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలను ఆచరణలో పెడతారు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధన ఆదాయం బాగుంటుంది.

వృషభం

చేపట్టిన పనులలో పురోగతి కలుగుతుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో మరింతగా రాణిస్తారు. ఉద్యోగమున సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు అందుకుంటారు.

మిధునం

మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణ భారం పెరుగుతుంది. చేపట్టిన పనులు నిరాశాజనకంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు వలన విశ్రాంతి లభించదు.

కర్కాటకం

సన్నిహితుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మిత్రులతో ఆలయదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో గందరగోళ పరిస్థితులుంటాయి.

సింహం

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు దక్కుతాయి. ఆధ్యాతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కన్య

నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. కొన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ సంబంధిత సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది.

తుల

సన్నిహితుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిదికాదు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందంగా సాగుతాయి. ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడతారు.

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నం కలిసిరాదు.

ధనస్సు

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం తెలుస్తుంది. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మకరం

కుటుంబ సభ్యులు నుంచి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృథా ఖర్చులు చేస్తారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది ఉద్యోగస్థులకు చికాకులు పెరుగుతాయి.

కుంభం

శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి.

మీనం

ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి సహాయం లభించక నిరాశ కలుగుతుంది. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..