తాళికట్టేముందు వరుడి ప్రశ్న.. ఆగిన పెళ్లి

by  |
తాళికట్టేముందు వరుడి ప్రశ్న.. ఆగిన పెళ్లి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నోటి దురద ఎంతటికి దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సందర్భంలో మంచో, చెడో జరిగి ఉంటుంది. అయితే ఓ పెళ్లి కొడుకు తాళి కట్టే ముందు వధువును అడిగిన ప్రశ్న ప్రకంపనలు సృష్టించింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు సైతం పెళ్లి కొడుక్కి ఏమైన ‘తిక్కా’అని ఊగిపోయారు. అతడి ప్రశ్నతో వధువు హర్ట్ అయింది. పెళ్లితంతు ఆగిపోయింది. ఇంతకు పెళ్లికుమారుడు అడిగిన ప్రశ్న ఏంటీ..? అతడికి ఆ సందేహం అప్పుడే ఎందుకు వచ్చింది..? ఒక్క ప్రశ్నకే పెళ్లి ఎందుకు ఆగిందో తెలుసుకోవాలంటే ‘దిశ’అందిస్తున్న ప్రత్యేక కథనం చదవాల్సిందే..!

నిజామాబాద్ జిల్లాలో అది ఓ పట్టణం. అతడో ఉన్నత విద్యా వంతుడు. అమ్మాయి బాగా చదువుకున్నది. ఇద్దరి కులాలు ఒక్కటే కావడం, అభిప్రాయలు కలవడంతో ఇరుకుటుంబాలు పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పట్టణంలోని ఓ చర్చిలో శుక్రవారం వివాహ తంతు ప్రారంభమైంది. చర్చి ఫాదర్.. పెళ్లి ఇరువురికి సమ్మతమేనా అని అడిగాడు. ఇరువురు ఓకే చెప్పడంతో వారి సంప్రాదాయం ప్రకారం తాళి కట్టే తంతుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో వరుడు అడిగిన ప్రశ్నతో వధువు తాను ఈ పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఖంగుతిన్న ఇరుకుటుంబ సభ్యులు వధువును నిలదీశారు. వరుడు అడిగిన ప్రశ్న వారికి చెప్పడంతో వారు షాక్ తిన్నారు. వెంటనే పెళ్లి రద్ధుకు అంగీకరించారు. విద్యావంతుడైన వ్యక్తే ఇలా అవమానకరంగా అర్ధరహితమైన ప్రశ్న అడిగితే భవిష్యత్తులో అతడితో కలిసి కాపురం చేయడం కష్టమని వధువు ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చూపులకు ముందే అన్నీ తెలుసుకోవాలని కానీ, తాళి కట్టే ముందు అడగరాని ప్రశ్న అడగడం సరైంది కాదని బంధుమిత్రులు అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి రద్దు చేసుకుంటున్నందున వధువుకు పెళ్లి ఖర్చులు చెల్లించాలని బంధువులు కోరడంతో వరుడి కుటుంబం అంగీకరించింది. దీంతో చివరి నిమిషంలో వివాహ ప్రక్రియను రద్ధు అయింది.

ఈ పెళ్లిలో ట్విస్ట్ ఏంటంటే ఉన్నత విద్యావంతుడైన పెండ్లి కొడుక్కు కొంచెం తిక్క ఉందని వధువు కుటుంబీకులకు తెలుసు. అయితే అతడి ఇచ్చిన కౌన్సిలింగ్ లో పూర్తిగా దారికి వచ్చాడని నిర్ధారించుకున్న తర్వాతే వివాహానికి సిద్ధమయ్యారు. కాని పెండ్లి తంతులో చర్చి ఫాదర్ ఇద్దరికి సమ్మతమే అనే చివరి ప్రశ్న సమయంలో వరుడు కాస్తా తిక్క ప్రదర్శించాడు. వధువును నీవు ఆడ- మగా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో షాక్ తిన్న వధువు తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని తేల్చిపారేసింది. కుటుంబ సభ్యులు వధువును ఎందుకు నిరాకరించావు అని ప్రశ్నిస్తే పెండ్లికి ముందే వరుడికి వచ్చిన సందేహాన్ని వివరించింది. వరుడికి ఇంకా తిక్క తగ్గలేదని నిర్ధారించుకుని పెండ్లిని రద్ధు చేసుకుని వెనుదిరిగారు. ఈ వార్త జిల్లాలో హాట్ టాఫిక్ అయింది. వరుడికి వచ్చిన సందేహంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed