గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కథతో వెబ్ సిరీస్ 

by  |
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కథతో వెబ్ సిరీస్ 
X

ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. చరిత్ర సృష్టించినవారైతేనేం.. చరిత్ర కాలరాసి వారైతేనేం… వారి జీవిత కథ ఇంటరెస్టింగ్ గా ఉండి, ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకుంటే.. దర్శక నిర్మాతలు బయోపిక్ తీసేందుకు రెడీ ఐపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే జీవిత కథను ఆధారంగా తీసుకుని వెబ్ సిరీస్ తీసేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ నిర్మాత శైలేష్ ఆర్.సింగ్. ప్రస్తుతం ఓటిటి ప్లాటుఫార్మ్స్ (OTT platforms) లో వెబ్ సిరీస్ కి డిమాండ్ ఉంది.

అందుకే సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ (web series) రూపంలో వికాస్ స్టోరీ చెప్పడానికి నిర్మాత మొగ్గు చూపుతున్నాడు కాబోలు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ తీయడానికి కావాల్సిన పర్మిషన్స్ నిర్మాత శైలేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమాకి దర్శకత్వ బాధ్యతలు హన్సల్ మెహతా తీసుకున్నారు.

కొద్దిరోజుల కిందట గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. ఈ ఘటనతో అతని గురించి దేశమంతటా తెలిసిపోయింది. వికాస్ ఎన్నో నేరాలకు ఒడిగట్టాడు. ఆఖరికి తనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను కూడా అతి కిరాతకంగా హింసించి చంపాడు.

వికాస్ కు రాజకీయంగానూ, పోలీసుల్లోనూ మంచి పలుకుబడి ఉండేదని… ఈ కారణంగానే అతను ఎన్ని నేరాలు చేసినా స్వేచ్ఛగా తిరుగుతుండేవాడని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. చివరికి ఏ వ్వవస్థ ఐతే అతనిని కాపాడుతూ వచ్చిందో అదే వ్యవస్థ చేతుల్లో హతమయ్యాడని దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.

Next Story

Most Viewed