మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,దుబ్బాక : మనస్థాపనతో ఓ వ్వక్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల మేరకు రామక్కపేట గ్రామానికి చెందిన రంగు సత్యం (45) కుటుంబానికి చెందిన ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరగడంతో మనస్థాపం చెందాడు.

దాంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఇద్దరు కుమారులని ఇంట్లో నుంచి బయటకు పంపించి చీరతో ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారులు కంగారుపడుతూ వచ్చి తల్లికి చెప్పడంతో వెంటనే ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు పగలగొట్టి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ పరిశీలించి చూడగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతిని భార్య రంగు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

Next Story