- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడాదిలో నేడే అతి పెద్ద రాత్రి.. కారణం ఏమిటి? ఎన్ని గంటలు ఉంటుందంటే?
దేశవ్యాప్తంగా తీవ్రమైన చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్రమైన చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగి.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు సూర్యుడి వేడి కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో శీతాకాలంలో ప్రకృతిలో కొన్ని మార్పులు ఆవిష్కృతమవుతున్నాయి. తొందరగా చీకటి పడిపోతుంది. ఉదయాన్నే పొగమంచు విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నేడు(డిసెంబర్ 21న) ఈ ఏడాదిలో అతి పెద్ద రాత్రి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు(ఆదివారం) రాత్రి సమయం 13.30 నుంచి 14 గంటలు ఉంటుందని అంటున్నారు. సూర్యుడి సదరన్ హెమీస్ఫియర్(దక్షిణార్ధ గోళం) ప్రయాణం ఇవాళ్టితో ముగిసి నార్తర్న్ హెమీస్ఫీయర్(ఉత్తరార్ధగోళం)లో ప్రయాణం టెక్నికల్‌గా మొదలవుతుంది. ఈ సమయంలో సూర్యుడి నుంచి భూమి అత్యంత దూరంగా వెళ్తుంది. భూమి ధ్రువం నుంచి 23.4 డిగ్రీల వంపులో ఉండటం వల్ల శీతాకాలపు అయనాంతాన్ని అనుభవిస్తున్నారు. దీనివల్ల రాత్రి సమయం రోజు ఉండేదాని కంటే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






