తెలంగాణలో ఈ సడన్ క్లౌడ్ బరస్ట్ కు కారణాలేంటి?

by Muthe.Rajitha |   (  Updated:2025-08-08 14:13:27  IST  )

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సడన్ క్లౌడ్ బరస్ట్స్ తో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసాయి.

తెలంగాణలో ఈ సడన్ క్లౌడ్ బరస్ట్ కు కారణాలేంటి?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సడన్ క్లౌడ్ బరస్ట్స్ తో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసాయి. అయితే ఈ అతిభారీ వర్షాలకు కారణం క్యుములోనింబస్ మేఘాలు అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అసలేంటీ ఈ క్యుములోనింబస్ మేఘాలు అంటే... అతిపెద్ద, గుండ్రని మేఘాలు, అత్యంత ఎత్తులో ఏర్పడతాయి. ఈ మేఘాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలను మోసుకువస్తాయి.

కొన్నిసార్లు వండగండ్లు కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ మేఘాలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటంటే... వాతారవరణంలో ఎక్కువ వేడి, తేమ ఉడటం. భూమి ఉపరితలంపై సౌరవికిరణం వల్ల వేడెక్కిన గాలి, తేమను గ్రహించి పైకి లేస్తుంది. ఈ గాలి చల్లబడి ఆవిరిగా మారి, అత్యంత ఎత్తులో పెద్ద మేఘాలను ఏర్పరుస్తుంది. ఈ మేఘాలు ట్రోపోస్ఫియర్‌ పొరలో 12-18 కి.మీ. ఎత్తు వరకు కూడా విస్తరించడం వల్ల వీటిని 'వజ్ర మేఘాలు' అని కూడా పిలుస్తారు. కాగా వాతారవరణంలో ఉష్ణోగ్రతల్లో ఎంత ఎక్కువ తేడాలు ఉంటే అంత త్వరగా ఈ మేఘాలు ఏర్పడతాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలి కూడా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.

అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా తెలంగాణలోకి ప్రవేశించాయి. పూర్తి వేసవికాలం ముగియకముందే వర్షాలు పడ్డాయి. దీనివల్ల తేమతో కూడిన గాలి అధికంగా లభించి భారీగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్స్ కి కారణం అయింది. కాగా నిన్న హైదరాబాద్ లో ఒక గంటలోనే 12 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపించగా.. నగరం చిగురుటాకులా వణికిపోయింది.

Next Story