Today's Weather Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..?

by Kodari Anjali |

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వర్షం రెండ్రోజులు కురిసి మళ్లీ కనుమరుగయ్యింది

Todays Weather Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వర్షం రెండ్రోజులు కురిసి మళ్లీ కనుమరుగయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలలో భారీ వర్షాలే లేవు. మే నెలలో అతిగా కురిసిన వానల జాడ లేనేలేదు. జూన్ ముగిసేందుకు వస్తోన్న వర్షం జోరందుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్నిప్రాంతాల్లో అసలు వర్షపు చుక్కే లేదు. ఇక నేడు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో తొలకరి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం తర్వాత జల్లులు పడే అవకాశం ఉంది. పగలు వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షం పడే సూచనలు లేవు. తక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం .. 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story