- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. రాబోయే 14 గంటల్లో అతి భారీ వర్షాలు
నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు చురుకుగా కదులుతోన్న వేళ భారత వాతావరణ శాఖ (India Meteorological Department) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు చురుకుగా కదులుతోన్న వేళ భారత వాతావరణ శాఖ (India Meteorological Department) కీలక ప్రకటన చేసింది. రాబోయే 14 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ (Telangana)లోని వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతో పాటు జంట నగరాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా పొరుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కోస్తాంధ్రా వ్యాప్తంగా భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, పిడుగలతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.






