Rains : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. ఆ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Muthe.Rajitha |

బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి(Surface Trough) ప్రభావంతో తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rains : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. ఆ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి(Surface Trough) ప్రభావంతో తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ద్రోణి కారణంగా జూలై ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రేపు తెలంగాణలోని 19 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. ఏపీలోని ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతారవరణ విభాగం వెల్లడించింది.

Next Story