Heat Wave : రాష్ట్రంలో భానుడి భగభగలు.. వడగాలులు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-14 10:57:14  IST  )

తెలంగాణ(Telangana)లో ఎండలు మండుతున్నాయి(HeatWave).

Heat Wave : రాష్ట్రంలో భానుడి భగభగలు.. వడగాలులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో ఎండలు మండుతున్నాయి(HeatWave). ఎండాకాలం(Summer) పూర్తిగా మొదలవకముందే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉగాది అయినా దాటకముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం(Hyderabad Meteorological Center) తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాలులు కూడా వీస్తాయని అన్నారు.

కాగా మార్చ్ 19 వరకు రాష్ట్రంలో ఈ హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న రెండురోజులపాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ విడుదల చేశారు. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి రావొద్దని హెచ్చరించారు. రాజధాని హైదరాబాద్ లో కూడా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే ఎండ తీవ్రత ఉన్నట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది.

Next Story