- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Monsoon : 2 రోజుల్లో ఏపీలో అడుగుపెట్టనున్న నైరుతి ఋతుపవనాలు
మరో రెండు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు(Monsoon) ఏపీ(AP)లో అడుగుపెట్టనున్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : మరో రెండు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు(Monsoon) ఏపీ(AP)లో అడుగుపెట్టనున్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. IMD ప్రకారం మాన్సూన్ మే 27 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. అయితే సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో ప్రవేశించే ఋతుపవనాలు ఈ ఏడాది మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం(LPA), బలమైన పశ్చిమ గాలుల కారణంగా రెండు రోజుల ముందుగానే రానున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. దక్షిణ కోస్తా ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై, జూన్ మొదటి వారంలో ఉత్తర కోస్తా ఆంధ్రా (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
ఈరోజు రాయలసీమలో కడప, చిత్తూరు, కోస్తాలో గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదై.. మాన్సూన్ రాక సూచనను తెలుపుతున్నాయి. ఈ ఋతుపవనాలు రాయలసీమలో పత్తి, వేరుశనగ, కోస్తాలో వరి సాగుకు ఊతం ఇస్తాయి. అయితే అధిక వర్షాల వల్ల తీరప్రాంత జిల్లాల్లో వరదల ప్రమాదం ఉండవచ్చని IMD హెచ్చరికలు జారీ చేసింది.






