ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ‘సెన్యార్’ హెచ్చరిక జారీ

by Kema Shiva Kumar |

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ‘సెన్యార్’ హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ‘సెన్యార్’ (Senyar) తుఫాన్‌గా రూపాంతరం చెందడంతో భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే మలాక్కా జలసమూహం, దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపంలో ఏర్పడిన తుఫాను దక్షిణ తూర్పు బంగాళాఖాతంలోకి మారి తీవ్రంగా బలపడుతోంది. దీంతో ఈనెల 29 నుంచి కోస్తా ఆంధ్రా పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈనెల 26 నుంచి 29 వరకు అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

Next Story