రాష్ట్రంలో మూడు రోజుల పాటు చలి తీవ్రత

by Muthe.Rajitha |

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు చలి వణికించబోతోంది.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు చలి తీవ్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు చలి వణికించబోతోంది. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పాటు ఉదయం , రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు తూర్పు , ఆగ్నేయ దిశ నుండి వీస్తాయని వెల్లడించింది. ఈ మూడు రోజులు ఉదయం వేళల్లో అక్కడక్కడ పొగ మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మూడు రోజుల అనంతరం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

Next Story