- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిప్పాయపాలెం బీచ్ వద్ద అరకిలోమిటర్ ముందుకు వచ్చిన సముద్రం
by Muthe.Rajitha |
ఏపీకి 'దిత్వా' తుఫాను ముప్పు తరుముకు వస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి 'దిత్వా' తుఫాను ముప్పు తరుముకు వస్తోంది. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలతో సముద్రం సుమారు 500 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకొచ్చింది. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ అధికారులు పర్యాటకులను బీచ్‌లోకి అనుమతించడం వివాదాస్పదమైంది.
ఇప్పటికే భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలను మోహరించారు.
Next Story






