తెలంగాణలో భానుడి భగభగలు.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరాయి. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో భానుడి భగభగలు.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అసలే ఎండ తీవ్రత అంటే.. అందుకు వడగాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. తెలంగాణ (Telangana)లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఏకంగా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం అందరినీ కలవరపెడుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి (Peddapally) జిల్లాలో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ప్రజలు మండుతున్న ఎండలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నారాయణపేట (Narayanapet) జిల్లాలో అత్యల్పంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, సాధారణం కంటే ఎక్కువ. పగటిపూట ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story