ఎండల నుంచి ఉపశమనం.. దేశవ్యాప్తంగా వర్షాలు, వడగళ్ల హెచ్చరిక

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 03:29:46  IST  )

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్‌వేవ్ నుంచి ప్రజలకు భారీ ఊరట లభించనుంది.

ఎండల నుంచి ఉపశమనం.. దేశవ్యాప్తంగా వర్షాలు, వడగళ్ల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రచండ భానుడి ప్రతానికి బ్రేక్ పడనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వాన (Hailstorm) కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఉత్తర, మధ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మే నెలలో సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని భావించినప్పటికీ, ఈ తాజా వర్ష సూచన ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వడగళ్ల వాన హెచ్చరిక..

ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పొలాల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story