Rain Alert: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఈ రాత్రికి భారీ వర్షాలు పడే జిల్లాలు ఇవే!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఈ రాత్రికి భారీ వర్షాలు పడే జిల్లాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ రాత్రికి రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర, పశ్చిమ (West) జిల్లాల్లో వర్ష ప్రభావం అత్యధికంగా ఉండబోతోందని అంచనా వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాబోయే కొద్ది గంటల్లో క్రింది జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదేవిధంగా రంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. రాత్రి వేళల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని, రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story