Rain Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక సూచన

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) ప్రజలకు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ప్రజలకు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు (నేడు, రేపు) పిడుగులతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. భద్రాద్రి, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ అదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉండటంతో ఆ జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పొలం పనులకు వెళ్లేవారు, గొర్రెల కాపరులు వర్షం వస్తే.. చెట్ల కిందకు వెళ్లొద్దని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Next Story