Southwest Monsoon: కేరళను తాకిన ఋతుపవనాలు.. ఇక వానలే వానలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-24 07:12:49  IST  )

ఇన్ని రోజులు ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఐఎండీ చల్లని కబురు అందించింది.

Southwest Monsoon: కేరళను తాకిన ఋతుపవనాలు.. ఇక వానలే వానలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇన్ని రోజులు ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లని కబురు అందించింది. శనివారం మధ్యాహ్నం నైరుతి ఋతుపవనాలు (Southwest Monsoon) కేరళను (Kerala) తాకినట్లు తెలిపింది. 48 గంటల్లో కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ, ఈ ఏడాది ఋతుపవనాలు వారం రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మరో రెండు, మూడు రోజుల్లోనే ఇవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశముందని, వీటి ప్రభావంతో జూన్‌ రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

అలాగే, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముందని, ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వివరించింది. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాలకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ఇక సాధారణంగా జూన్‌ 1 నాటికి ఋతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి అంచనాల కంటే ముందుగానే ఋతుపవనాలు రావడం 16 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అలాగే, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story