- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPA : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(LPA) కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(LPA) కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది. ఏపీతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం ఉత్తర-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడి, 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24-48 గంటల్లో మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, దీని ప్రభావంతో తీరం వెంబడి 50-60 కి.మీ./గంట వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం నివేదిక ప్రకారం ఈ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలకు కారణం కానుందని నివేదికలు అందజేసింది. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న మూడు రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగవచ్చునని తెలిపింది. ముఖ్యంగా జూన్ 26-28 వరకు మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.






