Big Rain Alert : అరేబియా సముద్రంలో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

by Muthe.Rajitha |

మిడిల్ ఈస్ట్ అరేబియా సముద్రం, సౌత్ కొంకణ్ తీర ప్రాంతంలో అల్పపీడనం(Arebian LPA) ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది.

Big Rain Alert : అరేబియా సముద్రంలో అల్పపీడనం..  అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ అరేబియా సముద్రం, సౌత్ కొంకణ్ తీర ప్రాంతంలో అల్పపీడనం(Arebian LPA) ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది. ఇది నార్త్ వైపు కదులుతూ రానున్న 36 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ఎఫెక్ట్ వల్ల తెలంగాణలోనూ భారీ వర్షాలు(Heavy Rains in Telangana) కురుస్తాయని వెల్లడించింది. అలాగే మే 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం(Bay Of Bengal LPA) ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది.

ఇక ఈరోజు తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. గంటకు 50 నుంచి 60 కిమీల వేగంతో ఈదురు గాలులు(Gusty Winds) వీస్తాయని పేర్కొంది. శుక్ర, శని వారాల్లో కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగగా.. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్టు తెలియజేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27న ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Next Story