- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెరిగిపోయింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ తెలంగాణలపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెరిగిపోయింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం (low pressure) ఏపీ తెలంగాణలపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా ఈ ఆల్పపీడనం బలపడటంతో పలు జిల్లాలకు తెలంగాణ వెదర్ మ్యాచ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాలలో తరచుగా వర్షాలు కురుస్తాయి, మొత్తం మీద నేడు ముసురుతో పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు ఆయన అంచనా వేశారు. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ (Red alert issued) చేశారు. దీంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్ సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాదారణ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం మొత్తం చల్లగా మారింది. అలాగే పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






