- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ అల్పపీడనం అక్టోబర్ 3న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, బుధవారం సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట్ లో 3 సెం.మీ, ఖమ్మం జిల్లా బోనకల్ లో 2 సెం.మీ, సూర్యాపేట్ జిల్లా చిలుకూర్ లో 2 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 1 సెం.మీ, ఖమ్మం జిల్లా మధిర, నల్గొండ జిల్లా మర్రిగూడలో 1 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం..
తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి సంబంధించిన ఆవర్తనం సముద్ర మట్టానికి 9.6 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, మరింత తీవ్రమై తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.






