- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న లపంగి నర్సింహా
by Ratna Kumari |
మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లపంగి నర్సింహాకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 లభించింది.

X
దిశ, మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లపంగి నర్సింహాకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 లభించింది. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా లపంగి నర్సింహా మాట్లాడుతూ.. ఈ అవార్డు తన వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదని, రాంరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు, గ్రామాభివృద్ధికి, ప్రజాసేవకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, పంచాయతీ సభ్యులు, అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Next Story






