- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైక్లోన్ ఎఫెక్ట్... తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు
ప్రస్తుతం మొంథా తుఫాను గండం ఏపీని వణికిస్తోంది. ఈనెల 28న తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం మొంథా తుఫాను గండం ఏపీని వణికిస్తోంది. ఈనెల 28న తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురవడంతోపాటు, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, అధికారయంత్రం అప్రమత్తమై.. శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. అయితే మొంథా ఎఫెక్ట్ ఏపీ మీదనే కాకుండా తెలంగాణ మీద కూడా తీవ్రంగా ఉండబోతోంది. ఈనెల 28న ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తీరం దాటిన తెల్లవారి అనగా అక్టోబర్ 29న ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






