Big Rain Alert : ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-28 10:55:58  IST  )

ముందుగానే వచ్చిన నైరుతి ఋతుపవనాలు(Monsoon), బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం(LPA)తో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి.

Big Rain Alert : ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ముందుగానే వచ్చిన నైరుతి ఋతుపవనాలు(Monsoon), బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం(LPA)తో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. కాగా బుధవారం రాత్రి తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి రాత్రి అతి భారీ వర్షాలు(HEAVY DOWNPOURS) కురవబోతున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ(HMD) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య, దక్షిణ జిల్లాలైన(West, Central, South TG districts) ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ సహ ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నిన్న కుండపోత వర్షాలు కురిశాయి. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు.

Next Story