ఈనెల 23 వరకు తెలంగాణలో భారీ వర్షాలు

by Muthe.Rajitha |

తెలంగాణలో ఆలస్యంగా మొదలైన ఋతుపవన వర్షాలు(Telangana Rains) ప్రస్తుతం జోరు అందుకున్నాయి.

ఈనెల 23 వరకు తెలంగాణలో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆలస్యంగా మొదలైన ఋతుపవన వర్షాలు(Telangana Rains) ప్రస్తుతం జోరు అందుకున్నాయి. పలు జిల్లాల్లో ఈపాటికే భారీ వర్షాలు(Heavy Rains) నమోదు అవుతుండగా.. ఇవి ఈనెల 23 వరకు కంటిన్యూ అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) ప్రకటించింది. ఈరోజు నాగర్ కర్నూల్, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HMD పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిమీల వేగంతో బలమైన గాలులు వీయనున్నట్టు తెలిపింది. కాగా మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా గత మూడు రోజుల నుంచి రాజధాని నగరంతోపాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Next Story