లాఠీఛార్జ్‌ చేసినోళ్లను కోర్టుకీడుస్తాం.. పోలీసులకు అభిజీత్ దీప్కే మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళణ 34వ రోజుకు చేరుకుంది.

లాఠీఛార్జ్‌ చేసినోళ్లను కోర్టుకీడుస్తాం.. పోలీసులకు అభిజీత్ దీప్కే మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేపట్టిన నిరాహార దీక్ష 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే (Abhijit Deepke)మీడియాతో మాట్లాడుతూ.. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన లాఠీఛార్జ్‌ను తీవ్రంగా ఖండించారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ చాలా దారుణంగా, క్రూరంగా ఉందని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడి చేసిన ఆ పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని.. ఖచ్చితంగా కోర్టుకీడుస్తామని అభిజీత్ దీప్కే మాస్ వార్నింగ్

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన..

అయితే, గత 26 రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటం పట్ల అభిజీత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని, కానీ సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కోల్పోవద్దని, అందుకే ఆయన నిరాహార దీక్షను విరమించాలని తామంతా విజ్ఞప్తి చేస్తున్నామని దీప్కే పేర్కొన్నారు.

Next Story