గబ్బర్ సింగ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన హరీష్ శంకర్

by Ajay Maddhiboyina |

గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్, న‌టుడు ర‌మేశ్ బ్రేయిన్ స్ట్రోక్ తో ఆస్ప‌త్రిలో చేరారు. అక‌స్మాత్తుగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ర‌మేశ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో న్యూరాలజిస్టుల ప్రత్యేక బృందం ఆధ్వ‌ర్యంలో చికిత్స అందిస్తున్నారు.

గబ్బర్ సింగ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన హరీష్ శంకర్
X

దిశ‌, వెబ్ డెస్క్: గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్, న‌టుడు ర‌మేశ్ బ్రేయిన్ స్ట్రోక్ తో ఆస్ప‌త్రిలో చేరారు. అక‌స్మాత్తుగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ర‌మేశ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో న్యూరాలజిస్టుల ప్రత్యేక బృందం ఆధ్వ‌ర్యంలో చికిత్స అందిస్తున్నారు. కాగా తాజాగా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఆస్ప‌త్రికి వెళ్లి ర‌మేశ్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామర్శించారు. ర‌మేశ్ ఆరోగ్య‌ప‌రిస్థితిపై వైద్యుల‌ను ఆరా తీస్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ర‌మేశ్ ఆరోగ్య ప‌రిస్థితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సైతం అత‌డి స్నేహితులు స‌మాచారం చేర‌వేశారు. ర‌మేశ్ ను ఆదుకోవాల‌ని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ర‌మేశ్ గ‌తంలో సినిమాల్లో జూనియ‌ర్ ఆర్టిస్టుగా, రౌడీగా చిన్న‌చిన్న పాత్ర‌ల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపురాలేదు. కానీ ప‌వ‌న్ గబ్బ‌ర్ సింగ్ సినిమాలో పేర‌డీ సాంగ్ లో హాస్యాన్ని పండించి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. సినిమాలో న‌టించిన ర‌మేశ్ తో పాటు మొత్తం గ‌బ్బ‌ర్ సింగ్ గ్యాంగ్ కు ఈ చిత్రంతో ఫేమ్ రాగా.. అందులో ర‌మేశ్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమా త‌ర‌వాత చాలా సినిమాల్లో న‌టుడిగా అవ‌కాశాలు అందుకున్నాడు.

Next Story