- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జన నాయగన్'లో శ్రీలీల లేకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
'జన నాయగన్'లో శ్రీలీలను తీసుకోవాలని మొదట భావించినప్పటికీ, చివరకు ఆ పాత్రకు మమితా బైజును ఎంపిక చేసినట్లు దర్శకుడు హెచ్. వినోద్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ''జన నాయగన్'. ఈ సినిమాను మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. చివరకు ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే వార్తలు మొదటి నుంచే వినిపించాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత ఇది 'భగవంత్ కేసరి' ఆధారంగా తెరకెక్కిందనే అభిప్రాయం బలపడింది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'భగవంత్ కేసరి' సినిమా చూసిన విజయ్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని తెలిపారు.
సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తీసుకుని, వాటి చుట్టూ కొత్త కథను రూపొందించాలని భావించి రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 'భగవంత్ కేసరి'లో శ్రీలీల కీలక పాత్రలో నటించగా,'జన నాయగన్'లో ఆ పాత్రను మమితా బైజు పోషించారు. శ్రీలీలను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు దర్శకుడు హెచ్. వినోద్ స్పందిస్తూ.. మొదట శ్రీలీలతో పాటు మరికొంతమంది నటీమణుల పేర్లను పరిశీలించామని, ఆ ప్రక్రియలో భాగంగానే చివరకు మమితా బైజును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 'జన నాయగన్'పై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






