- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rains Alert: మే 8 వరకూ భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
మే8వ తేదీన మహారాష్ట్ర, గుజరాత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, దక్షిణ తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశాలోని మయూర్ భంజ్, కియోంజర్, బాలేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.

దిశ, వెబ్డెస్క్: మరో నాలుగు రోజులపాటు దేశంలోని 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వెస్ట్ రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఈస్ట్ రాజస్థాన్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మే 6వ తేదీన రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే7న గుజరాత్, మహారాష్ట్రల్లోని కొన్నిప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మే8వ తేదీన మహారాష్ట్ర, గుజరాత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, దక్షిణ తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశాలోని మయూర్ భంజ్, కియోంజర్, బాలేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. సౌత్ స్టేట్స్ అయిన తమిళనాడు, తెలంగాణ, కోస్తాంధ్ర, కేరళకు కూడా భారీ వర్షసూచన చేసింది.
గడిచిన 24 గంటల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో గంటకు 70-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని, జమ్ము కశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చాయని తెలిపింది. భారీవర్షాల నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎన్టీఆర్ఎఫ్ బృందంతోపాటు విపత్తు నిర్వహణ బృందాలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.






