- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Rain Alert : తెలంగాణలో భారీ వర్షం.. మరో 4 రోజులూ కొనసాగనున్న వానలు
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం(Rain Alert) కురవనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం(Rain Alert) కురవనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈపాటికే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మరికాసేపట్లో వరుణుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. ఇక రాజధాని హైదరాబాద్ లోనూ నేటి సాయంత్రం అధిక వర్షం కురిసే ఛాన్స్ ఉందని IMD అధికారులు పేర్కొన్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులూ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ ఓ మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. వర్షం కురుస్తున్నపుడు చెట్ల కింద ఉండరాదని, విద్యుత్ వైర్ల కింద, రేకుల ఇళ్ళల్లో ఉండరాదని కీలక సూచనలు చేశారు అధికారులు.






