Weather Update : హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-26 12:57:20  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం మొదలవ్వడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Weather Update : హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన (Low Pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rains in Hyderabad) మొదలవ్వడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నగరంలోని కేపీహెచ్ బీ, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో ఈనెల 29 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather Department) అంచనా వేసింది. వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రేపు (మంగళవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert for Telangana Districts) జారీ చేసింది. ఎల్లుండి (బుధవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ... ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert for Telangana Districts) జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాగా.. గడిచిన 24 గంటల్లో సిద్ధిపేట, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Read More..

నైరుతి రుతుపవనాల రాకపై చంద్రబాబు ట్వీట్‌.. ఈ జిల్లావాసులకు APSDMA అలర్ట్

Next Story