నైరుతి రుతుపవనాల రాకపై చంద్రబాబు ట్వీట్‌.. ఈ జిల్లావాసులకు APSDMA అలర్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-26 12:57:07  IST  )

ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించినట్లు వాతావరణశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. నైరుతి రాకపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

నైరుతి రుతుపవనాల రాకపై చంద్రబాబు ట్వీట్‌.. ఈ జిల్లావాసులకు APSDMA అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించినట్లు వాతావరణశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. నైరుతి రాకపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

"నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. చాలా కాలం తర్వాత మే నెలలోనే రాష్ట్రానికి నైరుతి పలకరింపు శుభ పరిణామం. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం కావాలని.... రైతులకు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. వ్యవసాయాధారిత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతన్న బాగుంటాడు. అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది." అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.

కాగా.. నైరుతి రాకతో రాయలసీమ (Rayalaseema)లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మూడు రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని ఆయన హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Next Story