హైదరాబాద్ లో భారీగా వర్షం

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్ లో భారీగా వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. అల్వాల్, బొల్లారం, శామీర్పేట్, తూముకుంట, గాజుల రామారం, కూకట్పల్లి, KPHB, ప్రగతి నగర్, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్ నగర్, ఎర్రగడ్డలో ఉరుములతో కూడిన భారీ వాన పడుతోంది. కాగా మరో గంటలో ఉప్పల్, తార్నాక, SEC-BAD, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట్, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

కాగా భారీ వర్షానికి నగరంలోని రోడ్ల మీద నీరు నిలిచి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయాలని, ట్రాఫిక్ లో ఇరుక్కోవద్దని హైడ్రా నగర పౌరులకు అలర్ట్స్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాలోనూ ఓ మోస్తరు వాన కురుస్తోంది.

Next Story