Big Rain Alert : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన

by Muthe.Rajitha |   (  Updated:2025-04-18 13:01:09  IST  )

హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ శాఖ.

Big Rain Alert : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ శాఖ. నగరంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నగరంలో కుండపోత వానలు మొదలయ్యాయి. నగరంలోని పశ్చిమ, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కుంభవృష్టిలా కురుస్తోంది. కాగా మరో 3 గంటలపాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందని సమాచారం. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Next Story