Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. నేటి నుంచి ఎన్ని రోజుల వరకు వాన ఉందంటే..?

by Kodari Anjali |   (  Updated:2025-06-17 03:42:34  IST  )

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం వివిధ ప్రాంతాల్లో మారుతూ ఉంది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. నేటి నుంచి ఎన్ని రోజుల వరకు వాన ఉందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం వివిధ ప్రాంతాల్లో మారుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం వంటి ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి (జూన్ 17, 18, 19) మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జయశంకర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాదుతో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు, పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాతావరణ సూచనలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story