- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మానుకోట డీఎస్పీ
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును చక్కగా నిర్మించుకోవాలని మహబూబాబాద్ డీఎస్పీ నంబూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు.

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును చక్కగా నిర్మించుకోవాలని మహబూబాబాద్ డీఎస్పీ నంబూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ సబ్‌జైలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైలర్ మల్లెల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఖైదీలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను నిర్వీర్యం చేస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని అన్నారు.
మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, రవాణా వంటి చర్యలు చట్టరీత్యా తీవ్రమైన నేరాలని డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడైనా డ్రగ్స్ లేదా గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతితో పాటు వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం గంజాయి సహా వివిధ కేసుల్లో ఉన్న ఖైదీలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది మహ్మద్ ఖలీల్, మోట పోతుల వీరన్న, జనార్దన్, రామాంజనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.






