తమిళనాడులో సరికొత్త చరిత్ర.. పుట్టిన ప్రతి బిడ్డకూ 1 గ్రాము బంగారు ఉంగరం

by Malleboina Mahesh |

తమిళనాడులో సీఎం విజయ్ సరికొత్త స్కీమ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టే ప్రతి బిడ్డకూ 1 గ్రాము బంగారు ఉంగరం.. ఏటా రూ. 755 కోట్ల బడ్జెట్!

తమిళనాడులో సరికొత్త చరిత్ర.. పుట్టిన ప్రతి బిడ్డకూ 1 గ్రాము బంగారు ఉంగరం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో విజయ్.. నేతృత్వంలోని ప్రభుత్వం ఒక విప్లవాత్మక, చారిత్రాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహుమతిగా ఇచ్చే ‘తాయ్‌మామన్ తంగ మోధిరం తిట్టం’ (Thaimaaman Thanga Mothiram Thittam) పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రాబోయే సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డను ఆహ్వానిస్తూ మేనమామ ఇచ్చే ‘తాయ్‌మామన్ సీర్’ (మేనమామ కానుక) సంప్రదాయానికి ప్రతీకగా ఈ పథకానికి నామకరణం చేశారు.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక్కో బంగారు ఉంగరం విలువ సుమారు రూ. 13,600 గా ఉంటుందని అంచనా. ఈ వినూత్న పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా ఏకంగా రూ. 755.83 కోట్లను కేటాయించింది. ఈ పథకం సజావుగా సాగేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్’ (SPMU) అనే పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు ఎలాంటి లింగ వివక్ష (ఆడ, మగ బేధం లేకుండా) ఎన్నో కాన్పు (మొదటి బిడ్డ, రెండో బిడ్డ) అనే నిబంధనలు లేకుండా, అర్హులైన ప్రతి నవజాత శిశువుకు ఈ బంగారు ఉంగరాన్ని అందజేయనున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టాక తెచ్చిన ఈ భారీ స్కీమ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆకర్షణగా మారింది.

Next Story