- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేటలో జూలై 2న శ్రీ వేంకటేశ్వర హరినామ క్షేత్రానికి శంకుస్థాపన
సిద్దిపేట అర్బన్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర మహా మంత్ర పీఠం ఆధ్వర్యంలో నిర్మించనున్న హరినామ క్షేత్రానికి జూలై 2న శంకుస్థాపన జరగనుంది.

దిశ, సిద్దిపేట అర్బన్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో సిద్దిపేట అర్బన్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర మహా మంత్ర పీఠం ఆధ్వర్యంలో నిర్మించనున్న హరినామ క్షేత్రంకు జూలై 2న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. కే.వి. రమణాచారి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మహా మంత్ర పీఠం ప్రతినిధులు పుల్లగూర్ల సాయిరెడ్డి, సురేఖారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశ్రీ శ్రీ దేవనాథ్ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ, మంగళాశాసనాలతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిరూప ఆలయాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ గౌరీశంకర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 8:46 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే రోజు 'దిశా నిర్దేశం' మూడో సంపుటి పుస్తకావిష్కరణ, శ్రీనివాస కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.






