- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు వ్యాఖ్యలపై కూనంనేని కౌంటర్
మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓడిపోయిన వెంటనే టీజీబీకేఎస్ నేతలు వేరే యూనియన్ కు వెళ్లిపోయారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓడిపోయిన వెంటనే టీజీబీకేఎస్ నేతలు వేరే యూనియన్ కు వెళ్లిపోయారని చెప్పారు. తమ యూనియన్ కార్మికుల కోసం ప్రాణాలు ఇచ్చిందని చెప్పారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యిందని అంటున్నారని , తమకు దాంతో ఎలాంటి సంబంధం లేకపోయినా విమర్శిస్తున్నారని అన్నారు. సింగరేణి తప్పుడు లెక్కలు చూపించిందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం హరీష్ రావు కొత్తగూడెంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సింగరేణిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా కూనంనేని సాంబశివరావుపై విమర్శలు చేశారు. కూనంనేని బావుల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారని, బావుల వద్దకు వెళ్లి నిల్వలు ఉన్నాయో లేదో చూడాలని అన్నారు. కార్మికుల పక్షాన ఉంటావో కాంగ్రెస్ పక్షాన ఉంటావో తేల్చుకోవాలని హితవుపలికారు. అంతే కాకుండా సింగరేణిలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ప్రతివిషయంలో పెరిగిపోయిందని అన్నారు.






