- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, చిట్యాల : కూతురు పెళ్లి కని కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి ఫంక్షన్ హాల్ కు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న ఐదు లక్షలు నగదు, రెండు తులాల బంగారం చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శిరస్సు ముత్యాలు తన కూతురు వివాహం రామన్నపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న జరిగింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళాలు వేసి గురువారం ఉదయమే ఫంక్షన్ హాల్ కు వెళ్ళిపోయారు. వివాహం జరిగిన అనంతరం సాయంత్రం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో కంగారుపడిన ఇంటి యజమాని లోనికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులోని నగదు 5 లక్షలు, 2తులాలు బంగారం కనిపించకపోవడంతో లబోదిబోమని గుండెలు భాదుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించగా అందులో ఒక వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తచ్చాడుతూ కనిపించడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చోరీ చేసింది అతనేనా..?
చోరి జరిగిన అనంతరం సీసీ కెమెరాలో నమోదయి ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారని పరిశీలన చేసి చూడగా పెళ్లి జరిగిన అనంతరం వధూవరులను గుర్రపు బండిలో ఊరేగిస్తూ బరత్ తీసేందుకు ఇంటి యజమాని హైదరాబాద్ నుండి బరత్ ఒక గ్రూపును పిలిపించాడు. అయితే ఆ గ్రూప్ సభ్యులలో నుంచి ఒక వ్యక్తి కనిపించకపోవడం, సీసీ కెమెరాలలో నమోదైన వ్యక్తి అతడే కావడంతో అతనే చోరీ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు..






